‘పెళ్లి చూపులు’ హీరో కోసం మెగాస్టార్ చిరు ఏం చేశారో తెలుసా !

chiru

ఈ సంవత్సరం సంచలనం విజయం నమోదు చేసిన చిత్రాల్లో ‘పెళ్లి చూపులు’ మొదటిది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే గాక ఈ చిత్రం ఓవర్సీస్ లో సైతం బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఈ విజయంతో ఇందులో నటించిన నటీ నటులకు కూడా మంచి మంచి అవకాశాలొస్తున్నాయి. ముఖ్యానంగా హీరో విజయ్ దేవరకొండ అయితే వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. ఈయన నటిస్తున్న సినిమాల్లో ‘ద్వారక’ చిత్రం కూడా ఒకటి. శ్రీనివాస్ రవీంద్ర డైరెక్ట్ చేస్తునం ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది.

దీంతో యూనిట్ కోరిక మేరకు ఈ సినిమాకి సంబందించిన మోషన్ పోస్టర్ ను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా లాంచ్ చేశారు. ఈరోజు ఉదయం ‘ఖైధీ నెం 150’ సెట్లో ఈ కార్యక్రమం జరిగింది. మెగాస్టార్ తమ సినిమా పోస్టర్ ను లాంచ్ చేయడంతో హీరో, డైరెక్టర్, ఇతర క్రూ చాలా సంతోషింస్తూ తమ కోసం సమయం కేటాయించిన చిరంజీవిగారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇకపోతే ఈ చిత్రం యొక్క ఆడియో వేడుక రేపు జె.ఆర్.సి కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది.