చిరు లీక్స్ : భోళా శంకర్ సాంగ్ సెట్ వీడియో

చిరు లీక్స్ : భోళా శంకర్ సాంగ్ సెట్ వీడియో

Published on Jun 8, 2023 5:30 PM IST

chiru
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా భాటియా హీరోయిన్ గా తాజాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ భోళా శంకర్. తమిళ స్టార్ అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ వేదాళం కి రీమేక్ గా రూపొందిన ఈ మూవీలో కీర్తి సురేష్ మెగాస్టార్ కి చెల్లెలిగా నటిస్తుండగా ఇతర పాత్రల్లో మురళి శర్మ, సుశాంత్, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన బోళా మేనియా సాంగ్ అందరినీ ఆకట్టుకోగా తమ మూవీ నుండి ఒక గ్రాండ్ సెట్ లో వేసిన సాంగ్ తాలూకు వీడియో ని చిరు లీక్స్ పేరుతో మెగాస్టార్ చిరంజీవి కొద్దిసేపటి క్రితం తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.

చిరంజీవి, తమన్నా, కీర్తి సహా ప్రధాన తారాగణం మొత్తం పాల్గొన్న ఈ సాంగ్ ని ఒక భారీ సెట్టింగ్ లో తీస్తున్నారు. కాగా దీనికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ పోస్ట్ చేసిన సాంగ్ షూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా అన్ని కార్యక్రమాలు ముగించి భోళా శంకర్ మూవీని ఆగష్టు 11న విడుదల చేయనున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్ సంస్థలు నిర్మిస్తున్నాయి.

https://www.instagram.com/reel/CtOkJ3CpCAf/?igshid=MzRlODBiNWFlZA==

సంబంధిత సమాచారం

తాజా వార్తలు