బాలయ్యను ఆకాశానికి ఎత్తేసిన చిరు..!

Balakrishna Chiru

నేడు నందమూరి బాలకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక సాయం ప్రకటించడం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే కార్యక్రమంలో ఆయన ఏపీ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెరో 50లక్షల ఆర్థిక సాయం ప్రకటించడం జరిగింది. ఇక చిత్ర పరిశ్రమ బంద్ కారణంగా ఈ పరిశ్రమపై ఆధారపడి ఉపాధి కోల్పోయిన రోజు వారి సినీ కార్మికుల క్షేమం కోసం ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి ఆయన మరో 25లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. ఈ చెక్ ని బాలయ్య నిర్మాత సి కళ్యాణ్ కి అందించడం జరిగింది.

ఈ కరోనా క్రైసిస్ ఛారిటీని స్థాపించి ముందుకు నడుపుతున్న మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ ఆర్థిక సాయాన్నీ సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. ఆపద సమయంలో ఆదుకోవడానికి ముందుండే బాలయ్య పెద్ద మనసుకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సినీ పరిశ్రమ ఎప్పుడు, ఎలాంటి ఆపదలో చిక్కుకున్నా, అందరూ కలిసి కట్టుగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు. బాల కృష్ణను పొగుడుతూ చిరు వేసిన ట్వీట్ ప్రత్యేకత సంచరించుకుంది.

Exit mobile version