వేదాళం రీమేక్ లో చిరంజీవి, డైరెక్టర్ ఎవరంటే..?

Published on Aug 7, 2020 12:59 am IST


మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన క్రేజీ న్యూస్ బయటిక్ వచ్చింది. ఆయన తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్ లో నటించనున్నారు. 2015లో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఆ మూవీలో అజిత్ మాస్ రోల్ ప్రేక్షకులను బాగా ఫిదా చేసింది. ఆ పాత్రకు తనకు సూటవుతుందని భావించిన చిరంజీవి ఈ మూవీ రీమేక్ లో నటించనున్నారు. ఇక ఈ మూవీ దర్శకుడిగా మెహర్ రమేష్ వ్యవహరిస్తారట. చిరంజీవి ఫ్యామిలీకి బాగా సన్నిహితుడైన మెహర్ ఈ మూవీకి పనిచేయడం ఖాయం అంటున్నారు.

ఇక ఈ మూవీని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె ఎస్ రామారావు నిర్మించే అవకాశం కలదట. లేని పక్షంలో రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తారట. ఇక ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదు. ప్రస్తుతం చిరంజీవి దర్శకుడు కొరటాల శివతో ఆచార్య మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More