తండ్రి సాంగ్స్ చూస్తోన్న స్టార్ కిడ్ !

Published on Jun 20, 2021 11:00 pm IST

దివంగత నటుడు చిరంజీవి సర్జా తనయుడు జూనియర్‌ చిరు నెటిజన్లను బాగా ఆకటుకుంటున్నాడు. ఐపాడ్‌ ముందు కూర్చుని తన తండ్రి నటించిన ‘సింగా’ చిత్రంలోని ‘వాట్‌ ఎ బ్యూటిఫుల్‌’ పాటను వింటూ కనిపించాడు. జూనియర్ చిరు ఈ సాంగ్ ను చూస్తూ వీడియోలో తన తండ్రి స్టెప్స్ ను పరిశీలిస్తూ ఉండగా మేఘనారాజ్‌ ఈ వీడియోను తీశారు. అభిమానుల కోసం తన ఇన్‌ స్టాలో షేర్‌ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘జూనియర్ చిరు తన తండ్రి నటించిన సినిమాల్లో పాటల్ని తరచూ చూస్తూ ఉంటాడు. ఒకసారి ప్లే చేస్తే మళ్లీమళ్లీ అదే చూస్తానంటాడు. నా బిడ్డని ఆనందంగా చూసుకోవడం నా బాధ్యత. హ్యాపీ ఫాదర్స్‌ డే’ అని మేఘనా తన ఇన్‌స్టాలో ఎమోషనల్ గా రాసుకొచ్చింది.

గత ఏడాది గుండె పోటుతో చిరంజీవి సర్జా మరణించిన సంగతి తెలిసిందే. అయితే జూనియర్ చిరు భవిష్యత్తులో కన్నడ నాట స్టార్ హీరోగా రాణిస్తాడని అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :