మోహన్ బాబు కోరికను కాదన్న చిరు.

Published on Mar 28, 2020 12:16 pm IST

ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మధ్య ఆసక్తికర చర్చ సాగించింది. ఈ ఉగాదికి చిరంజీవి సోషల్ మీడియా మాధ్యమాలలో ఒకటైన ట్విట్టర్ ప్రారంభించారు. మొదటిసారి సోషల్ మీడియాలోకి ఎంటరైన చిరంజీవికి టాలీవుడ్ హీరోలు మరియు ప్రముఖులు స్వాగతం పలికారు. అలాగే చిరంజీవి మిత్రుడు మోహన్ బాబు కూడా మిత్రమా స్వాగతం అని వెల్కమ్ చెప్పారు. దీనికి ప్రతిగా చిరంజీవి రాననుకున్నావా..రాలేననుకున్నావా అని ట్వీట్ చేశారు.

దీనికి సమాధానంగా మోహన్ బాబు హగ్ చేసుకున్నప్పుడు చెవుతాను అనగా, కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే హగ్స్, షేక్ హాండ్స్ ఇచ్చుకోకూడదు, సోషల్ డిస్టెన్స్ అవసరం అని సందర్భోచితంగా స్పందించారు. ట్విట్టర్ లో వీరిని ఫాలో అవుతున్న ఫ్యాన్స్ ట్వీట్స్ చూసి జాయ్ ఫీలవుతున్నారు. మరి చిరు సలహాకు మోహన్ బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More