“వకీల్ సాబ్”లో ప్రకాష్ రాజ్ నటనకు మెగాస్టార్ ప్రత్యేక అభినందనలు.!

Published on Apr 12, 2021 3:09 pm IST

లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా అనన్య నాగళ్ళ, నివేతా థామస్ మరియు అంజలిలు కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్” హిట్ టాక్ తెచ్చుకొని దూసుకెళ్తుండగా తెలుగు ఇండస్ట్రీ పెద్దలు అందరి నుంచి మన్ననలు పొందుతుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో పవన్ తో పాటు పోటాపోటీగా స్ట్రాంగ్ లాయర్ రోల్ లో కనిపించిన ప్రకాష్ రాజ్ నటనకు కూడా సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మరి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వకీల్ సాబ్ లో ప్రకాష్ రాజ్ నటనకు నివ్వెరపోయి తనని స్వయంగా కలిసి తన ప్రత్యేక అభినందనలు తెలియజేసారు. పవన్ కు కౌంటర్ పార్ట్ గా వకీల్ సాబ్ లో ప్రకాష్ రాజ్ చేసిన నటన అమేజింగ్ అని కొనియాడి ప్రకాష్ రాజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగాలని చిరు ఆకాంక్షించారు. దీనితో ప్రకాష్ రాజ్ కూడా బదులుగా తనని ఎప్పుడూ ఇన్స్పైర్ చేస్తూ ఎంకరేజ్ చేసే మెగాస్టార్ కు కృతజ్ఞత కలిగి ఉంటానని తన ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం :