
యువహీరో సందీప్ కిషన్ నటించిన చివరి చిత్రం బీరువా కలెక్షన్ల రేసులో వెనుకబడిన సంగతి తెలిసినదే. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తరువాత సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న సందీప్ మరో యువ నటుడు రాహుల్ తో కలిసి టైగర్ సినిమాతో మన ముందుకు రానున్నాడు. ఈ మేరకు సందీప్ వినూత్న రీతిలో ప్రచారం చెయ్యడం విశేషం.
150వ సినిమా వ్యవహారాలలో బిజీగా వున్నా మెగాస్టార్ క్రేజ్ ని వాడుకుంటూ టైగర్ టైటిల్ సాంగ్ తో చిరంజీవి పాత సినిమా రషెస్ ని వాడుకుంటూ ఒక వీడియోని రిలీజ్ చేసాడు. అతికొద్ది సమయంలోనే నెట్ లో హల్ చల్ చెయ్యడమేకాక సినిమాపై ఒకింత ఆసక్తిని సైతం కనబరచడం విశేషం.

