చిరు “లాహే లాహే” పాటకు తగ్గని క్రేజ్..!

Published on Aug 19, 2021 3:00 am IST

మెగస్టార్ చిరంజీవి హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా సక్సెస్‌ ఫుల్‌ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ఆచార్య”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్‌కు, లాహే లాహే పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

అయితే యూట్యూబ్‌లో లాహే లాహే పాట ఏకంగా 80 మిలియన్ ప్లస్ వ్యూస్‌ని దక్కించుకుంది. ఈ పాటకు నటి సంగీత చేసిన డ్యాన్స్ స్పెషల్ అట్రాక్షన్ కాగా, చిరు వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు లిరిక్స్ రామజోగయ్య శాస్త్రి ఇవ్వగా, మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఇదిలా ఉంటే చిరంజీవి బర్త్‌డే కానుకగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఈ నెల 22న విడలయ్యే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :