లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న చిరు అల్లుడి సినిమా !

kalyan

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ చిత్ర సీమకు పరిచయం కాబోతున్నారు. సాయి కొర్రపాటి నిర్మించబోయే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో నిన్ననే మొదలైంది. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్ కు జోడీగా మాళవిక నాయర్ నటించనుంది. ఈ హీరోయిన్ గతంలో ‘కళ్యాణ వైభోగమే’ సినిమాలో నటించింది.

తాజా సమాచారం మేరకు ఈ సినిమా కాలేజ్ బ్యాక్ డ్రాప్లో జరిగే ప్రేమకథగా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. కళ్యాణ్ దేవ్ సత్యానంద్ మాస్టర్ దగ్గర నటనలో శిక్షణ కూడా తీసుకున్నారు. తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, పోసాని ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందిస్తోన్న ఈ సినిమాకు యోగేష్ సంగీతం అందించనున్నారు.

Exit mobile version