వైరల్ గా మారిన చిరంజీవి ఫ్యామిలీ అరుదైన ఫోటో.

Published on Dec 7, 2019 10:33 am IST

ముప్పై ఏళ్లనాటి చిరంజీవి అరుదైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటోలో చిరంజీవి భార్య సురేఖ తో పాటు చంటివాడిగా ఉన్న రామ్ చరణ్, చిరు పెద్ద కుమార్తె సుస్మిత ఉండటం విశేషం. ఎదో ఓ కార్యక్రమంలో సుస్మిత పూజ నిర్వహిస్తుండగా చిరంజీవి కెమెరా పట్టుకొని ఉన్నారు. ఈ ఫోటో 80లలో చిరు తన కుటుంబంతో కలిసివున్నప్పుడు ఎవరో తీసిందిగా తెలుస్తుంది. చిరంజీవి 1980లో అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను పెళ్లి చేసుకున్నారు.

ఇక తాజాగా సైరా నరసింహారెడ్డి అనే భారీ పీరియాడిక్ మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. అలాగే ఇటీవల టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తో తన 152వ చిత్రాన్ని ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం పూజా కార్యక్రమాలతో ఈ మూవీ ప్రారంభం కాగా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. హీరో రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించనున్నారు. ఈ మూవీలో హీరోయిన్ మరియు ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది. ఓ మంచి సోషల్ కాన్సెప్ట్ ఆధారంగా కమర్షియల్ కోణంలో దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించనున్నాడట.

సంబంధిత సమాచారం :

More