తన పార్ట్ పూర్తి చేసుకున్న హీరోయిన్ !

Published on Mar 13, 2019 8:43 am IST

నేను శైలజ’ ఫెమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రాబోతున్న చిత్రలహరి సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయింది. కాగా ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్య క్రమాల్లో ఉంది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శనితో పాటు మరో హీరోయిన్ నివేత పేతురాజ్ కూడా నటిస్తోంది. కాగా ఇప్పటికే కళ్యాణి ప్రియదర్శిని ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ కూడా చెబుతున్నారు.

కాగా తాజాగా కళ్యాణి ప్రియదర్శిని తన పాత్రకు సంబంధించిన షూటింగ్ తో పాటు డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. తన మొదటి సినిమా ‘హలో’ మూవీలో అఖిల్ సరసన నటించి నటనపరంగా మొదటి సినిమాతోనే బాగా ఆకట్టుకున్న కళ్యాణి ప్రియదర్శిని, తన రెండో సినిమా సాయి ధరమ్ తేజ్ సరసన ‘చిత్రలహరి’లో నటిస్తోంది.

ఇక ఈ సినిమా ఏప్రిల్ 12వ తేదీన విడుదల కానుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సక్సెస్‌ఫుల్‌ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై రూపొందిస్తున్నారు. సంచలన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ న్యూ లుక్ లో కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం :

More