‘చిత్రలహరి’ 10 డేస్ కలెక్షన్స్… ‘కాంచన 3’ మూడు రోజులకే !

Published on Apr 22, 2019 4:00 pm IST

కమర్షియల్ సినిమాకు బి.సి సెంటర్స్ లో ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుందని మరో సారి రుజువు అయింది. ఓ పక్క స్ట్రేట్ సినిమాల హడావుడితో పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కూడా ఓ డబ్బింగ్ సినిమా.. అది కూడా, పెద్ద పెద్ద స్టార్స్ లేని సినిమా, పైగా పెద్దగా ప్రమోషన్స్ చెయ్యని సినిమా.. ఏకంగా బాక్సాఫీస్ వద్ద స్ట్రేట్ తెలుగు సినిమా కంటే భారీ వసూళ్లను రాబడుతూ దూసుకెళ్తుంది. అదే రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో హారర్ కామిక్ థ్రిల్లర్ గా వచ్చిన ‘కాంచన 3’.

మంచి అంచనాల మధ్య ఏప్రిల్ 12న విడుదలైన సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి బాక్సాఫీస్ వద్ద కృష్ణ జిల్లాలో మొత్తం 10 రోజులకు గానూ 74.99 లక్షల షేర్ ను రాబట్టింది. అది.. మంచి ప్రమోషన్స్ మరియు మెగా అభిమానులు అండ దండలు ఉండగా. కానీ ‘కాంచన 3’ మాత్రం కృష్ణా జిల్లాలో కేవలం మూడు రోజులకుగానూ రూ. 69.20 లక్షల షేర్ ను రాబట్టింది. ఒక విధంగా ఇది భారీ తేడానే. చిత్రలహరి పది రోజుల కలెక్షన్స్ కు, కాంచన 3 మూడు రోజుల కలెక్షన్స్ కు కేవలం నాలుగు లక్షలే తేడా కావడం విశేషమే.

అలాగే క్లాసిక్ చిత్రం సూపర్ డూపర్ హిట్ చిత్రం అంటూ ప్రశంసల వర్షంలో ముద్దవుతున్న ‘జెర్సీ’ కూడా ‘కాంచన 3’తో పోటీ పడాల్సిన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే.. కృష్ణా జిల్లాలో జెర్సీ మొదటి మూడు రోజులకుగానూ రూ. 76.79 లక్షల షేర్ ను కలెక్ట్ చేసింది. అంటే.. మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకున్న ‘కాంచన 3’ కలెక్షన్స్ కంటే.. ఒక్క ఏడు లక్షలు ఎక్కువ అంతే. మొత్తానికి కృష్ణా జిల్లాలో బాక్సాఫీస్ వద్ద ‘కాంచన 3’తో పోటీ పడటానికి మన స్ట్రేట్ తెలుగు సినిమాలు బాగానే శ్రమిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :