చిత్రలహరి లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on Apr 15, 2019 8:04 pm IST

సాయి ధరమ్ తేజ్ వరుస పరాజయాలకు బ్రేక్ వేసేలా వుంది చిత్రలహరి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం డీసెంట్ టాక్ తో విజయం దిశగా దూసుకెళ్తుంది. ఇక ఈ చిత్రం మొదటి వారాంతంలో పర్వాలేదనిపించే వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మూడు రోజుల్లో 10కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక 13కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం ఇదే రన్ ను కొనసాగిస్తే ఈ వారంలో బ్రేక్ ఈవెన్ అవుతుంది.

నేను శైలజ ఫేమ్ కిశోర్ తిరుమల తెరకెక్కించిన ఈ చిత్రంలో తేజు కు జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ నటించగా తమిళ హీరోయిన్ నివేథ పేతురాజ్ కీలక పాత్రలో కనిపించింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.

సంబంధిత సమాచారం :