‘చిత్రలహరి’లోని పాత్రల పరిచయం జరిగింది !

Published on Mar 13, 2019 11:01 am IST

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా ‘నేను శైలజ’ ఫెమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘చిత్రలహరి’. కాగా తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదల అయింది. ‘చిత్రలహరి’లోని పాత్రలు అంటూ ఈ రోజు ఉదయం 9 గంటలకు టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం.

కాగా టీజర్ రొటీన్ టీజర్ లా కాకుండా కాస్త కొత్తగా ఉంది. సినిమాలోని పాత్రలను పరిచయం చేసిన విధానం, టీజర్ లోని కొన్ని డైలాగ్స్ నివేత పేతురాజ్ మగ్గాళ్ళ గురించి చెప్పిన డైలాగ్, సార్ ధరమ్ తేజ్ లాస్ట్ లో చెప్పిన సండే డైలాగ్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ప్రముఖ హాస్య నటుడు కమ్ హీరో సునీల్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తోన్నాడు. కాగా ఈ సినిమా ఏప్రిల్ 12వ తేదీన విడుదల కానుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సక్సెస్‌ఫుల్‌ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై రూపొందిస్తున్నారు. సంచలన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ న్యూ లుక్ లో కనిపించనున్నాడు. సాయి ధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శనితో పాటు మరో హీరోయిన్ నివేత పేతురాజ్ కూడా నటిస్తోంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :