చిత్రలహరి టీజర్ కు సూపర్ రెస్పాన్స్ !

Published on Mar 14, 2019 10:26 am IST

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ‘చిత్రలహరి’ టీజర్ నిన్న విడుదలై మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంటుంది. 24 గంటల్లో ఈ టీజర్ 32లక్షల కు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. సాయి ధరమ్ నటించిన సినిమాల టీజర్లకు ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం ఇదే మొదటి సారి. తేజు నటించిన గత చిత్రం తేజ్ ఐ లవ్ యు టీజర్ 1.6 మిలియన్ల వ్యూస్ ను రాబట్టింది.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ , నివేత పేతురాజ్ నటిస్తుండగా ప్రముఖ నటుడు సునీల్,వెన్నల కిశోర్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈచిత్రం ఏప్రిల్ 12న విడుదలకానుంది. ఇక ఇటీవల డబుల్ హ్యాట్రిక్ పరాజయాలను చవి చూసిన తేజు ఈ చిత్రం తో నైనా బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :