చిత్రలహరి టీజర్ రెడీ అవుతుంది !

Published on Mar 10, 2019 12:15 am IST

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ‘చిత్రలహరి’ షూటింగ్ తుది దశకు చేరుకుంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా చిత్ర హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పింది. ఇక ఈ చిత్రం యొక్క టీజర్ ను రెడీ చేసే పనిలో ఉన్నారట చిత్ర యూనిట్. ఈ టీజర్ రొమాంటిక్ గా వుండనుందట. హోలీ కానుకగా ఈ టీజర్ ను విడుదలచేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే త్వరలోనే ఈ టీజర్ విడుదల గురించి అధికారిక ప్రకటన వెలుబడనుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నివేత పేతురాజ్ మరో కథానాయికగా నటిస్తుండగా ప్రముఖ నటుడు సునీల్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈచిత్రం ఏప్రిల్ 12న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More