చిత్రలహరి ట్రైలర్ : తేజు ఈ సారి హిట్టు కొట్టేలా వున్నాడు !

Published on Apr 7, 2019 9:51 am IST

‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయి తేజ్ నటించిన తాజా చిత్రం ‘చిత్రలహరి’ విడుదలకు సిద్ధమవుతుంది. నిన్న ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించగా తాజాగా ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను విడుదలచేశారు. ఇక ఈ ట్రైలర్ ఎమోషనల్ గా వుంది. సక్సెస్ కోసం పోరాటం చేసే విజయ్ పాత్రలో తేజు లుక్ ఆకట్టుకుంది.
డైలాగ్స్ తోపాటు విజువల్స్ , మ్యూజిక్ కూడా బాగుంది. ఇక విజయ్ పాత్ర తేజు ప్రెసెంట్ సిచ్యువేషన్ కి చాలా దగ్గరగా వుంది. వరుసగా ఆరు ప్లాపుల తరవాత తేజు మళ్ళీ ఈ సినిమా తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

ఓవరాల్ గా ట్రైలర్ మాత్రం బాగుంది. మరి ఈ సారి తేజు చిత్రలహరి తో విజయం సాధించేలా వున్నాడు. కళ్యాణి ప్రియదర్శన్ ,నివేత పేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్12 న విడుదలకానుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి !

సంబంధిత సమాచారం :