తేజు, నాని తో పోటీపడనున్నాడా ?

తేజు, నాని తో పోటీపడనున్నాడా ?

Published on Nov 24, 2018 2:49 PM IST

sai dharam tej1

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘చిత్ర లహరి’ షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయ్యింది. కిశోర్ తిరుమల తెకెక్కిస్తున్నా ఈ చిత్రం ఫై తేజు చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేస్తామని ఇంతకుముందే ప్రకటించారు.

దాంట్లో భాగంగా ఏప్రిల్ 19న ఈచిత్రాన్ని విడుదలచేయడానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అయితే ఏప్రిల్లో రెండు పెద్ద సినిమాలు థియేటర్లకు రానున్నాయి. ఏప్రిల్ 5న మహేష్ ‘మహర్షి’ విడుదలకానుంది కాబట్టి ఈచిత్రం తో పోటీపడే సాహసం చేయలేరు. కనీసం రెండు వారాల గ్యాప్ అవసరం. ఇక 19వ తేదీ విడుదల చేస్తే కూడా కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం వుంది. ఎందుకంటె అదే రోజు నాని నటిస్తున్న ‘జెర్సీ’ చిత్రం విడుదలవుతుంది. క్రికెట్ నేపథ్యంలో వచ్చే సినిమా కావడంతో మాములుగా నే ఈచిత్రంహైప్ వుండడం సహాజం. ఒకవేళ జెర్సీ తో పోటీవద్దు అనుకుంటే 26వ తేదీని సోలోగా రిలీజ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు