‘చిత్రలహరి’లోని పాత్రలు రేపు కలుస్తారట !

Published on Mar 12, 2019 11:36 am IST

‘నేను శైలజ’ ఫెమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా ‘చిత్రలహరి’ అనే సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదల అవ్వబోతుందని చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను విడుదల చేసింది. ‘చిత్రలహరి’లోని పాత్రలు 13వ తారీఖున ఉదయం 9 గంటలకు మిమ్మల్ని కలుస్తారు అని పేర్కొంది చిత్రబృందం.

ప్రముఖ హాస్య నటుడు కమ్ హీరో సునీల్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తోన్నాడు. కాగా ఈ సినిమా ఏప్రిల్ 12వ తేదీన విడుదల కానుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సక్సెస్‌ఫుల్‌ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై రూపొందిస్తున్నారు. సంచలన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ న్యూ లుక్ లో కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం :

More