రామ్ తేజ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త చిత్రం ‘చోర శికామణులు’ అధికారికంగా ప్రారంభమైంది. శ్రీకరి-వివాన్ సమర్పణలో శ్రీకరి క్రియేషన్స్ బ్యానర్‌పై బానూరు నాగరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆనంద్ కుర్మా కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు చిత్ర ప్రముఖుల సమక్షంలో జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, త్రినాథరావు నక్కిన స్క్రిప్ట్ అందించగా, త్రినాథరావు నక్కిన తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు.
యాక్షన్, క్రైమ్, కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నరేష్, అజయ్ ఘోష్, సంపూర్ణేష్ బాబు, మురళీధర్ గౌడ్, అప్పు, కరణ్, జబర్దస్త్ సత్య శ్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆనంద్ రాజావిక్రమ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జగదీష్ కొమరి కెమెరామెన్‌గా, కేజీఎఫ్ ఫేమ్ శ్రీకాంత్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై 25 నుంచి ప్రారంభం కానుంది. ఒక పాట చిత్రీకరణతో ఈ షెడ్యూల్‌ను మొదలుపెట్టనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. రానున్న రోజుల్లో మరిన్ని అప్‌డేట్స్‌ను పంచుకుంటామని మేకర్స్ వెల్లడించారు.


