ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టనున్న ‘చుట్టాలబ్బాయి’ టీమ్ !

chuttalabbai-1
ఇప్పటి వరకూ మాస్ మసాలా సినిమాలతో మాస్ హీరోగా నిలబడటానికి సాయికుమార్ తనయుడు, హీరో ‘ఆది’ చాలా ప్రయత్నాలే చేశాడు. వాటిలో కొని సక్సెస్ ఇవ్వగా మరికొన్ని అంతగా ప్రభావం చూపలేదు. అందుకే ఈసారి ఆది కొత్తగా ఫ్యామిలీ డ్రామా, కామెడీ కలగలిసిన ‘చుట్టాలబ్బాయి’ చిత్రంతో మన ముందుకొస్తున్నాడు. ఈ సినిమాను ‘వెంకట్ తలారి, రామ్ తల్లూరి’ నిర్మాణంలో దర్శకుడు ‘వీరభద్రం’ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జూలాిన సెన్సార్ కార్యక్రమం జరుపుకోనున్న ఈ చిత్రం ఆగష్టు 5న విడుదలకానుంది.

సమయం తక్కువగా ఉండటంతో టీమ్ ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టనుంది. అందులో భాగాంగా రేపు హీరో ఆది తండ్రి ‘సాయి కుమార్’ పుట్టినరోజు సందర్బంగా టీజర్ ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంలో ఆది సరసననమితా ప్రమోద్ హీరోయిన్ గా నటించింది.