నెట్ ఫ్లిక్స్ లో ఈ చిన్న సినిమా పెద్ద విజయం.!

Published on May 16, 2021 3:02 pm IST

మళ్ళీ విజృంభిస్తున్న ఈ కోవిడ్ ప్యాండమిక్ టైంలో గత ఏడాది లానే అన్ని భాషల్లో కూడా పలు చిత్రాలు నేరుగా ఓటిటిలో విడుదలకు వస్తున్నాయి. అలా మన తెలుగులో కూడా కొన్ని చిత్రాలు ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కు వచ్చాయి. మరి వాటిలో వికాస్ వశిష్ట హీరోగా కాండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “సినిమా బండి” కూడా ఒకటి.

దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో నేరుగా స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని ప్రతీ ఒక్కరినీ కదిలించింది. అయితే ఈ చిత్రం విజయం నెట్ ఫ్లిక్స్ లో నేషనల్ వైడ్ టాప్ స్థానంలో కొనసాగుతుంది. ఇండియన్ వైడ్ గా ఈ చిన్ని చిత్రం నెట్ ఫ్లిక్స్ లో నెంబర్ 1 స్థానంలో నిలబడింది. దీనిని బట్టి ఈ చిత్రం ఏ స్థాయిలో అలరించిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

సంబంధిత సమాచారం :