‘పుష్ప’ తర్వాత సుకుమార్ దేవరకొండతోనే.. నో ఛేంజ్

Published on Apr 19, 2021 6:11 pm IST

స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రజెంట్ ‘పుష్ప’ పనుల్లో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేయాలి. చాన్నాళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. ఫాల్కన్ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. వీరికి ఇదే మొదటి సినిమా. అందుకే భారీ బడ్జెట్ కేటాయించి చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకుంటున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా ఇది కాస్త ఆలస్యమైంది. సుకుమార్ ‘పుష్ప’కు ఇంకా కాస్త సమయం పట్టేలానే ఉంది.

ఈలోపు పుకార్లు మొదలయ్యాయి. సుకుమార్-దేవరకొండ కాంబినేషన్ క్యాన్సిల్ అయిందని, సుకుమార్ ‘పుష్ప’ తర్వాత రామ్ చరణ్ హీరోగా సినిమా చేస్తారనే వార్తలు మొదలయ్యాయి. ఈ పుకార్లు కాస్త బలంగానే వీయడంతో ఫాల్కన్ సంస్థ కూడ గట్టిగానే స్పందించింది. ముందుగా అనుకున్న ప్రకారమే సుకుమార్, దేవరకొండ కాంబినేషన్లోనే తమ సినిమా ఉంటుందని, ప్రణాళిక ప్రకారమే అది మొదలవుతుందని, కొంతమంది క్రియేట్ చేస్తున్న రూమర్లను అస్సలు నమ్మవద్దని తేల్చి చెప్పింది. ఈ క్లారిటీతో సుక్కూ, విజయ్ దేవరకొండల ప్రాజెక్ట్ తప్పక ఉంటుందని, ప్రెజెంట్ ఇద్దరూ చేస్తున్న సినిమాలు పూర్తవగానే అది మొదలవుతుందని తేటతెల్లమైంది.

సంబంధిత సమాచారం :