‘బాలయ్య’ తరువాత సినిమా పై క్లారిటీ !

‘బాలయ్య’ తరువాత సినిమా పై క్లారిటీ !

Published on Jun 30, 2020 3:00 AM IST


బాలయ్య రైతు క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడట. ‘బాలయ్య – బి గోపాల్’ సూపర్ హిట్ కాంబినేషన్ లో ఈ సినిమా ఉంటుందని.. బాలయ్య శైలిలోనే సినిమా సాగుతూ కాస్త కొత్తగా కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ఇప్పటికే పూర్తి చేసుకుందట. ప్రెజెంట్ ఫామ్ లో ఉన్న టాప్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ సినిమా కోసం ఫుల్ స్క్రిప్ట్ రాస్తున్నారు.

మరి సాయి మాధవ్ బుర్రా బాలయ్య కోసం పక్కా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రాశాడట. నిజానికి ఈ సినిమా క్యాన్సల్ అయినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలు అవాస్తవం అని తెలుస్తోంది. ‘బాలయ్య – బి గోపాల్’ కాంబినేషన్ సినిమా వస్తోంది. బాలయ్య కెరీర్లోనే సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచిన ‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’ సినిమాలు బి గోపాల్ డైరెక్ట్ చేసినవే. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తోన్న బాలయ్య, పూరితో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు