సోషల్ మీడియాని షేక్ చేసిన ఎన్టీఆర్ లుక్ పై క్లారిటీ.!

సోషల్ మీడియాని షేక్ చేసిన ఎన్టీఆర్ లుక్ పై క్లారిటీ.!

Published on Nov 12, 2022 8:00 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు దర్శకుడు కొరటాల శివతో తన కెరీర్ లో 30వ సినిమాలో నటించనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఇరువురి కలయికలో ఈ చిత్రం రెండోది కావడం పైగా ఎన్టీఆర్ కి ఈ చిత్రం RRR లాంటి భారీ హిట్ కావడంతో పాన్ ఇండియా వైడ్ సెన్సేషనల్ అంచనాలు అయితే నెలకొన్నాయి. ఇక ఈ భారీ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి.

ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్ గా ఎన్టీఆర్ కొత్త మేకోవర్ బయటకి వచ్చి సోషల్ మీడియాని ఒక్కసారిగా షేక్ చేసి పారేసింది. అయితే దీనిపై చాలా మందికి అసలైన క్లారిటీ లేదు. ఎన్టీఆర్ ప్రిపేర్ చేసినటువంటి ఈ కొత్త లుక్ కేవలం ఒక యాడ్ కోసం మాత్రమే తప్ప ఎన్టీఆర్ 30 సినిమాలో లుక్ అయితే కాదు. సో ఎవరూ ఇప్పుడే ఒక అంచనాకి వచెయ్యక్కర్లేదు. మరికొన్ని వారాల్లో అయితే తన భారీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి మరో కొత్త లుక్ లో వెళ్లనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు