ఆ అడల్ట్ సినిమా విడుదలకు లైన్ క్లియర్ !

Published on Mar 14, 2019 6:10 pm IST

ఇటీవల ట్రైలర్ తో సెన్సేషన్ సృష్టించిన చిత్రం చీకటి గదిలో చితక్కొట్టుడు. అడల్ట్ కంటెంట్ తో యూత్ ను టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. హోలీ కానుకగా ఈ చిత్రం మార్చి 21న విడుదలకానుంది. బాలమురళి బాలు సంగీతం అందించిన ఈ చిత్రాన్ని బ్లూఘోస్ట్ పిక్చర్స్ నిర్మించింది.

ఆదిత్ , ఆర్జే హేమంత్ ,నిక్కీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈచిత్రాన్ని సంతోష్ పి జయకుమార్ తెరకెక్కించాడు. మరి ట్రైలర్ తో హైప్ తెచ్చుకున్న ఈచిత్రం అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

More