క్లైమాక్స్ ఫైట్ లో బాలయ్య ‘డిక్టేటర్’

క్లైమాక్స్ ఫైట్ లో బాలయ్య ‘డిక్టేటర్’

Published on Dec 16, 2015 10:00 PM IST

Dictator
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 99వ సినిమా ‘డిక్టేటర్’ షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫిక్స్ చేయడంతో బాలయ్య ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ ఫినిష్ చేస్తున్నాడు. ఇటీవలే ఢిల్లీలో ఓ మేజర్ పార్ట్ ని ఫినిష్ చేసుకున్న ఈ చిత్ర టీం ప్రస్తుతం హైదరాబాద్ లో క్లైమాక్స్ పార్ట్ కి సంబందించిన యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తోంది. ఫైట్ మాస్టర్ రవివర్మ నేతృత్వంలో బాలయ్య – ఫైటర్స్ పైన ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు. ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ షూట్ తో టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది.

ఆ తర్వాత మిగిలి ఉన్న రెండు పాటలని షూట్ చేస్తున్నాడు. అందులో ఒకటి స్పెషల్ సాంగ్, ఈ సాంగ్ లో బాలయ్యకి జోడీగా శ్రద్ధ దాస్ కనిపించనుంది. షూటింగ్ అప్డేట్ ఇలా ఉంటే, డిసెంబర్ 20న భారీ ఎత్తున ‘డిక్టేటర్’ ఆడియో లాంచ్ . ఆ వేడుకకి సంబందించిన పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. మరోవైపు రిలీజ్ కి ఇంకా నెల రోజులే ఉండడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోంది. బాలయ్య సరసన అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి కోన వెంకట్ – గోపి మోహన్ కథని అందించారు. శ్రీవాస్ డైరెక్టర్.

తాజా వార్తలు