
జోరుగా కురుస్తున్న వర్షంలో విలన్స్ తో అలసట లేకుండా ఫైట్ చేస్తున్నారు రాక్ స్టార్ మంచు మనోజ్. ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘కరెంట్ తీగ’. ప్రస్తుతం తిరుపతిలో ‘కరెంట్ తీగ’ క్లైమాక్స్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం గత కొన్ని రోజుల నుండి రెయిన్ ఎఫెక్ట్ లో ఫైట్ షూట్ చేస్తున్నారు. సోమవారంతో ఈ ఫైట్ చిత్రీకరణ పూర్తయింది. ఫైట్ చాలా బాగా వచ్చింది, చాలా కష్టపడి చేశాం. ప్రేక్షకులకు త్వరలో ఈ ఫైట్ చూపించాలి అనుకుంటున్నాను అని మంచు మనోజ్ తెలిపారు.
మంచు మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ చిత్రానికి జి.నాగేశ్వర రెడ్డి దర్శకుడు. సన్నీ లియోన్ రకుల్ ప్రీత్ టీచర్ గా ప్రత్యేక పాత్రలో నటించింది. సన్నీ నటించిన సన్నివేశాలు, ప్రత్యేక గీతం సినిమాకు అదనపు ఆకర్షణ అని యూనిట్ సభ్యులు తెలిపారు. వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని మంచు విష్ణు నిర్మిస్తున్నారు. అచ్చు సంగీత దర్శకుడు. త్వరలో మూవీ ఆడియో రిలీజ్ డేట్, సినిమా వివరాలను వెల్లడించనున్నారు.

