అ సినిమాలో క్లైమాక్స్ హైలెట్ గా ఉండబోతోందట !

15th, February 2018 - 08:46:19 PM

అన్ని సినిమాలయందు ‘అ!’ సినిమా వేరయా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది నాని ‘అ!’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటించిన ప్రధాన పాత్రలు ప్రతి 15 నిమిషాలకు ఒకరు పరిచయం అవుతుంటారని సమాచారం. సినిమాలో జరగబోయే తరువాతి సన్నివేశం ఎంటనేది ప్రేక్షకులకు అంతు చిక్కని విధంగా ఉండబోతుంది తెలుస్తోంది.

ముఖ్యంగా ఈ సినిమాలో క్లైమాక్స్ ప్రేక్షకులను అలరించబోతోందని తెలుస్తోంది. కొత్త కాన్సెప్ట్ తో రానున్న ఈ సినిమా ఆడియన్స్ కు నచ్చుతుందని నాని ఇంటర్వ్యూ లో తెలిపాడు. కాజల్ పాత్ర ఈ సినిమాలో ప్రధానంగా ఉండబోతోందని సమాచారం. ఇలాంటి సినిమా ఆడితే తెలుగులో మరిన్ని ఇలాంటి కొత్త సినిమాలు వచ్చే అవకాశం ఉంది. రేపు విడుదల కానున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.