సీఎం విజయ్ కొడుకు డైరెక్టర్ గా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ రిలీజ్ డేట్ ఫిక్స్!

సీఎం విజయ్ కొడుకు డైరెక్టర్ గా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on May 29, 2026 11:59 AM IST

ఇళయ దళపతి అలాగే తమిళనాడు నూతన సీఎం విజయ్ జోసెఫ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకునిగా కొత్త టర్న్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. విజయ్ లానే జేసన్ కూడా హీరో అవుతాడు అనుకుంటే అందరికీ ట్విస్ట్ ఇస్తూ తాను దర్శకునిగా సినిమాలో తన ఫ్యూచర్ ప్లాన్ చేసుకున్నాడు.

అలా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ తో స్టార్ట్ చేసిన ఆ సినిమానే ‘సిగ్మా’. ఇంట్రెస్టింగ్ యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఫైనల్ గా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. ప్రస్తుతానికి తమిళ్ వరకు మాత్రమే సినిమా జులై 31న విడుదల చేస్తున్నట్టుగా కొత్త పోస్టర్ తో ప్రకటించారు.

సందీప్ కిషన్ కి తెలుగు మార్కెట్ కూడా ఉంది కానీ ఏకకాలంలో అయితే ఈ సినిమా తెలుగు రిలీజ్ ని మేకర్స్ కన్ఫర్మ్ చేయలేదు. ఇంకా సమయం ఉంది కానీ ముందు రోజుల్లో ఏమన్నా ఖరారు చేస్తారేమో చూడాలి. ఇక ఈ చిత్రంలో జాతి రత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు