భారీ సెట్టింగ్ ల డైరెక్టర్ గుణశేఖర్ ప్రస్తుతం చేస్తోన్న హిరణ్య కశ్యప సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే మోహన్ బాబుది ఏ పాత్ర అనేది ఇంకా క్లారిటీ లేదు. మరి కొన్నాళ్ళు ఆగితే గాని ఈ వార్త పై స్పష్టత రాదు. ఇక ఈ సినిమాకి మాటలు అందించమని త్రివిక్రమ్ ను కోరినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా ‘రానా’ ప్రధాన పాత్రగా ఈ భారీ పౌరాణికం మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇక ఈ చిత్రంలో విఎఫ్‌ఎక్స్ వర్క్ అధికంగా ఉండటం కారణంగా ఈ సినిమాను 150 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారని సమాచారం. అన్నట్టు ఈ క్రేజీ సినిమా పురాణగాధల్లో ఒకటైన ‘హిరణ్య కశ్యపుడు – భక్త ప్రహల్లాద’ల కథ ఆధారంగా రూపొందనుంది. అయితే ఇప్పటికే పట్టాలెక్కాల్సిన ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి వర్చ్యువల్ టెక్నాలజీని వాడటమే కారణం అని తెలుస్తోంది. అలాగే పర్ఫెక్షన్, క్వాలిటీ కోసం టీమ్ ఈ సాంకేతికతను వాడుతున్నారట. ఇక రానా చేస్తున్న ‘అరణ్య’ విడుదలకు రెడీ అవడం, వేణు ఊడుగుల దర్శకత్వంలో చేస్తున్న ‘విరాటపర్వం’ చకచకా జరుగుతుండటంతో త్వరలోనే అంటే వేసవి లేదా వేసవి తర్వాత గుణశేఖర్ చిత్రం సెట్స్ మీదికి వెళ్లే వీలుంది.


