మహేష్ సినిమాలో కీలకంగా నిలవనున్న కాలేజ్ ఎపిసోడ్స్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ చిత్రంలో కాలేజ్ స్టూడెంట్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసం మహేష్ గడ్డం పెంచి లుక్ కూడ మార్చుకున్నారు. ఈ అంశమే సినిమా పట్ల ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొనేలా చేసింది. అంతేగాక ఈ కాలేజ్ నేపథ్యమే సినిమాలో కీలకమైన పాయింట్ అని కూడ తెలుస్తోంది.

అందుకే దర్శకుడు వంశీ పైడిపల్లి ముందుగా కాలేజ్ బ్యాక్ డ్రాప్లో కీలకమైన ఇంటెన్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ప్రస్తుతం డెహ్రాడూన్ లో జరుగుతున్న మహేష్, చిత్రీకరణలో పూజ హెగ్డేలతో పాటు ఇతర ముఖ్య తారాగణం కూడ పాల్గొంటున్నారు. అశ్విని దత్, దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి.