‘గెస్ట్ రోల్’తో రీఎంట్రీ ఇస్తోన్న తెలుగు హీరోయిన్ !

Published on Apr 25, 2019 1:00 am IST

వైవిధ్యమైన పాయింట్ తో తెరకెక్కిన ‘కార్తికేయ’ సినిమాతో తెలుగు తెర మీద దర్శకుడుగా తన ప్రయాణం మొదలు పెట్టాడు చందు మొండేటి. అయితే చందు మొండేటి చివరగా చేసిన ‘సవ్యసాచి’ సినిమా నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫిస్ వద్ద అపజయాన్ని మూట్టకట్టుకుంది. దాంతో చందు మొండేటి నాగార్జునతో అలాగే ‘శర్వానంద్’తో అనుకున్న ప్రాజెక్ట్ లు ఆగిపోయాయి.

ప్రస్తుతం చందు తన తరువాత సినిమాను నిఖిల్ తో ‘కార్తికేయ 2’గా చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ‘కార్తికేయలో హీరోయిన్ గా నటించిన కలర్స్ స్వాతి.. ‘కార్తికేయ 2’లోనూ నటించబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కాగా కలర్స్ స్వాతి ‘కార్తికేయ 2’లో హీరోయిన్ కాదట. జస్ట్ గెస్ట్ రోల్ లో మాత్రమే కనిపిస్తోందని సమాచారం. మొత్తానికి కలర్స్ స్వాతి తన హిట్ సినిమాతోనే మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతుందన్నమాట.

సంబంధిత సమాచారం :