అంజలి ‘గీతాంజలి’ సీక్వెల్ లో స్వాతి.!

అంజలి ‘గీతాంజలి’ సీక్వెల్ లో స్వాతి.!

Published on Jan 27, 2015 3:19 PM IST

swathi

‘ప్రేమకథా చిత్రమ్’ సక్సెస్ తో టాలీవుడ్ లో హర్రర్ సినిమాల జోరు ఊపందుకుంది. తక్కువ బడ్జెట్ లో ఓ మంచి హర్రర్ కామెడీ సినిమా తీయడానికి పలువురు నూతన దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. ఇదే జోనర్ లో ఇటీవలే వచ్చి పెద్ద హిట్ అయిన సినిమా ‘గీతాంజలి’. అంజలి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి కోన వెంకట్ మాటలు అందించడమే కాకుండా సహా నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ప్రస్తుతం ఈ చిత్ర మేకర్స్ ఈ సినిమాకి సీక్వెల్ చేసే పనిలో ఉన్నారు. అందుకోసం ఇప్పటికే కథని కూడా సిద్దం చేసుకున్నారు.

మన తెలుగులో ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న స్వాతి రెడ్డిని ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఎంపిక చేసారు. అలాగే ముందుగా ఈ సినిమాకి ‘త్రిపుర’ అనే టైటిల్ ని అనుకున్నారు. స్వాతి ప్రసతుతం ఈ సినిమా కోసం సిద్దమవుతోంది. త్వరలోనే ఈ సినిమా ఫైనల్ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఈ సీక్వెల్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి..

తాజా వార్తలు