‘వైవా’ హర్షకు “కలర్ ఫొటో” బ్రేక్ ఇవ్వనుందా.?

Published on Aug 7, 2020 11:53 pm IST


మన రెండు తెలుగు స్టేట్స్ లో ఉన్న ఫిల్మీ అండ్ ఎంటర్టైన్మెంట్ లవర్స్ కు “వైవా” హర్ష పేరును కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. “వైవా” అనే ఒక్క షాట్ ఫిల్మ్ తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఈ టాలెంటెడ్ నటుడు పలు సినిమాల్లో కూడా నటించాడు. చాలా మంది అగ్ర తారలు నుంచి చిన్న హీరోలతో కూడా ఎన్నో చిత్రాల్లో నటించాడు.

అలా యూట్యూబ్ మరియు సినిమాలతో పాటుగా ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో కూడా మంచి అవకాశాలు దక్కించుకొని తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే ఇటీవలే “కృష్ణ అండ్ హిస్ లీల” అలాగే భానుమతి రామ కృష్ణ చిత్రాల్లో కనిపించి మెప్పించాడు. అయితే ఇప్పటి వరకు నటునిగా సాదా సీదా రోల్స్ రావడం తో తనలోని అసలైన ప్రతిభ ఏంటి అన్నది ఇంకా బయటకు రాలేదు.

కానీ ఇప్పుడు తాను నటిస్తున్న “కలర్ ఫొటో” సినిమాలో మాత్రం హర్ష నటనలో ఒక సరికొత్త కోణం చూడనున్నట్టు తెలుస్తుంది. హీరో సుహాస్ తో ఈ చిత్రంలో ఎండింగ్ వరకు కొనసాగే ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించనున్నాడు. అయితే ఈ రోల్ చాలా బావుంటుందని తెలుస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ లో హర్ష హైలైట్ అవుతాడట. ఇక ఇక్కడ నుంచి హర్షకు మంచి బ్రేక్ వస్తుందని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం :

More