సింపుల్ గా పెళ్లి చేసేసుకున్న తెలుగు హీరోయిన్ !

Swathi

బుల్లితెరలో ‘కలర్స్’ అనే ప్రోగ్రామ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది కలర్స్ స్వాతి. కలర్స్ ప్రోగ్రామ్ తో మంచి పాపులారిటీ సొంతం చేసుకొని, సినిమాల్లో సేడ్ క్యారెక్టర్స్ నుంచి హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అయితే తాజాగా ఆమె ఎటువంటి ఆర్భాటం లేకుండా తన ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంది. గురువారం రాత్రి తన కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య నిరాడంబరంగా పెళ్లి చేసుకుని అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చింది.

వరుడు మలేసియన్‌ ఎయిర్‌లైన్స్‌ పైలట్‌ అని తెలుస్తోంది. పేరు వికాస్‌ అని అతనితో స్వాతి గత కొన్ని నెలలుగా ప్రేమలో ఉందని సమాచారం. ఐతే వికాస్‌ కేరళాకి చెందిన వ్యక్తి కావడం విశేషం. ప్రేమికులు ఇద్దరూ తమ పెద్దలను ఒప్పించి వేదమంత్రాల మధ్య ఒక్కటయ్యారు. సెప్టెంబర్‌ 2న కొచ్చిలో వరుడు ఇంటి వద్ద వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది.

Exit mobile version