అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన స్టార్ కమెడియన్.

Published on Aug 4, 2020 3:41 pm IST

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ పృథ్వి అనారోగ్యానికి గురయ్యారు. పది రోజుల నుంచి తీవ్ర జ్వరం, జలుబు లక్షణాలతో బాధపడుతున్నారు. దీంతో సోమవారం రాత్రి హస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు.

రెండుసార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నప్పటికీ నెగిటివ్ వచ్చిందని ఆ వీడియోలో పేర్కొన్నారు. సీటీ స్కాన్ కూడా చేయించానన్నారు. కొంత మందికి లక్షణాలు ఉన్నప్పటికీ కరోనా నెగిటివ్ వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు చెప్పారని తెలిపారు. జ్వరం, ఇతర లక్షణాలు తగ్గకపోవడంతో వైద్యుల సూచన మేరకు క్వారంటైన్‌లో చేరానన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. త్వరలో క్షేమంగా తిరిగివస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం :

More