‘భాగ్యనగర వీధుల్లో’.. ఓన్లీ కామెడీనే – శ్రీనివాస రెడ్డి

Published on Dec 3, 2019 8:50 pm IST

కమెడియన్ నుండి హీరోగా మారి పలు సినిమాలు చేసిన శ్రీనివాస రెడ్డి.. ఈ సారి దర్శక నిర్మాతగా కొత్త టర్న్ తీసుకుని రూపొందించిన చిత్రం ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. కాగా ఈ సినిమా డిసెంబ‌ర్ 6న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో శ్రీనివాస‌రెడ్డి మాట్లాడుతూ.. ‘నిజానికి ఈ చిత్రాన్ని మేం చిన్న కాన్సెప్ట్‌ గానే మొదలుపెట్టాం. అలాగే ఈ సినిమాకు ముందు నేను నిర్మాత‌ను మాత్ర‌మే. కానీ వేరే డైరెక్ట‌ర్‌ ను పెట్టినా ఆయన వెన‌క ఏమైందంటూ నేను నిల‌బ‌డాల్సి వ‌స్తుంది. దీంతో ఈ సినిమాని చివరికీ నేనే డైరెక్ట్ చేశాను. దాంతో డైరెక్టర్ కావాల‌నే నా కోరిక అలా తీరింది అన్నారు.

ఇక ఈ సినిమా ఫుల్ జౌట్ అండ్ ఔట్ కామెడీ అని.. గంట 53 నిమిషాలున్న ఈ సినిమాలో దాదాపు గంట‌న్న‌ర సేపు ప‌డి ప‌డి న‌వ్వుతూనే ఉంటామని.. సినిమాలో ఎక్కడా నో యాక్ష‌న్‌, నో సెంటిమెంట్.. ఓన్లీ కామెడీనే అని శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస‌రెడ్డి, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందింది.

సంబంధిత సమాచారం :

More