అరవింద సమేతలో మిస్సయింది ఈసారి గట్టిగా..!

Published on Apr 5, 2020 9:26 am IST

ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మూవీ ప్రకటించినప్పటి నుండి అసలు కథ ఏమిటీ? జోనర్ ఏమై ఉంటుంది అనే ఆసక్తి కొనసాగుతూనే ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రం త్రివిక్రమ్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే అందుకుంది. ఐతే త్రివిక్రమ్ మార్క్ హ్యూమర్ అండ్ కామెడీ అనేది లేకుండా పోవడం ఫ్యాన్స్ ని ఒకింత నిరాశ పరిచింది. దీనితో ఈసారి త్రివిక్రమ్ ఈ యాంగిల్ పై ద్రుష్టి సారించారట.

ఎన్టీఆర్ తో ఆయన చేయనున్న మూవీలో సీరియస్ కంటెంట్ తో పాటు త్రివిక్రమ్ మార్కు కామెడీ దట్టించి స్క్రిప్ట్ సిద్ధం చేస్తారట. గత చిత్రంలో వీర రాఘవుడిలాగా సీరియస్ రాయలసీమ కుర్రాడిలా ఎన్టీఆర్ ని ప్రెజెంట్ చేసిన త్రివిక్రమ్ కొత్తగా చూపించనున్నాడని తెలుస్తుంది. ఏది ఏమైనా ఎమోషన్ అండ్ యాక్షన్ తో మంచి హ్యూమర్ తో ఈ చిత్రం ఉండనుందని సమాచారం. ఎన్టీఆర్ కూడా కామెడీ పంచ్ లతో రెచ్చిపోతాడని టాక్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ మూవీని నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More