ఆనాటి కామెడీనీ గుర్తుచేసిన కోట, బాబుమోహన్..!

Published on Jul 27, 2021 10:58 pm IST

ఆనాడు కోట శ్రీనివాస్‌రావు గారికి, బాబు మోహన్‌కి మధ్య ఉన్న కామెడీ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతలా నవ్వించేదో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీరిద్దరి మధ్య సాగిన ఆనాటి కామెడీనీ ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులకు గుర్తుచేయబోతున్నారు స్టార్ మా వారు. ఈ ఆదివారం ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా “కామెడీ స్టార్స్” కార్యక్రమానికి కోట శ్రీనివాస్‌రావు మరియు బాబుమోహన్‌లు వచ్చారు. అయితే తాజాగా దీనికి సంబంధించి ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది.

ఎప్పటిలాగానే ఇందులోని టీంస్ తమ తమ కామెడీ స్కిట్లతో నవ్వులు పూయించారు. కోట శ్రీనివాస్‌రావు గారు, బాబు మోహన్‌ల మధ్య జరిగిన కామెడీ హిలేరియస్‌గా అనిపించింది. మీరు తెలుసుకోవాల్సింది ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాదని, గోల్డ్ ఎప్పటికీ ఓల్డ్ కాదన్న విషయాన్ని గుర్తించుకోవాలని కోట గారు చెప్పిన మాటలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. చివరలో కోట గారికి టీం అంతా కలిసి సన్మానం కూడా చేశారు. మరీ ఈ ఫ్రెండ్ షిప్ డే స్పెషల్ ఎపిసోడ్‌ను మిస్ కాకుండా చూడాలంటే మాత్రం ఈ ఆదివారం 1:30 గంటలకు స్టార్ మాలో వచ్చే “కామెడీ స్టార్స్”ని తప్పక చూడాల్సిందే. అంతవరకు ఈ ప్రోమో వైపు ఓ లుక్కేయండి.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :