టైమ్ మెషీన్ లో వందేళ్లు ముందుకొచ్చిన సద్దాం ఏం చేశాడంటే?

Published on Jul 1, 2021 8:07 pm IST


ప్రేక్షకులను అలరించడం లో బుల్లితెర ప్రోగ్రామ్స్ సైతం ముందు ఉంటాయి. ఇప్పటికే పలు కార్యక్రమాల తో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ మా, కామెడీ స్టార్స్ తో ఆనందం పంచుతున్న సంగతి తెలిసిందే. అయితే బుల్లితెర పై నవ్వుల వినోదం అందిస్తున్న కార్యక్రమాల్లో ఒకటి కామెడీ స్టార్స్. సద్దాం అతని ఫ్రెండ్ కనిపెట్టిన టైమ్ మెషీన్ లో వందేళ్లు భవిష్యత్ లోకి వెళ్తారు. అయితే ఆ ఇద్దరూ కూడా అక్కడ జరుగుతున్న పరిణామాల ను చూసి ఎలా షాక్ అయ్యారు అనేది ఈ ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట ముప్పై నిమిషాలకు మా టీవీ లో చూడవచ్చు.

అయితే వందేళ్లు అయిన కరోనా వైరస్ అంతం కాకపోవడం వంటి సన్నివేశాలను ఆకట్టుకునేలా ఉన్నాయి. రెండు వందల కరోనా వేవ్ రావడం పై ప్రేక్షకులని నవ్వించే విధంగా ఉన్నాయి. అయితే ఈ స్కిట్ లో మెగాస్టార్ చిరంజీవి పాత్ర చేస్తున్న వ్యక్తి కి సద్దాం డ్యాన్స్ నేర్పించడం, డైలాగ్స్ చెప్పడం వంటివి ఆకట్టుకుంటాయి. అయితే ఈ కార్యక్రమం ను పూర్తిగా చూడాలి అంటే ఆదివారం వరకూ వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :