పోస్ట్ ఫోన్ అయినా మళ్ళీ పోటీ ఉందట !

Published on Apr 18, 2021 2:00 am IST

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో సినిమాల రిలీజ్ డేట్లును వరుసగా పోస్ట్ ఫోన్ చేస్తున్నారు. బాలయ్య బాబు బోయపాటి శ్రీను అఖండ సినిమా, రవితేజ ఖిలాడి సినిమా ఒకే రోజు మే 28న రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ దెబ్బకు అనుకున్న డేట్ కి సినిమాలు రిలీజ్ అయ్యేలా లేవు. కానీ వీరిద్దరి సినిమాలు మళ్ళీ ఒకే రోజు రిలీజ్ అయ్యేలా ఉన్నాయి. ఎప్పుడు ఎనౌన్స్ చేసినా మళ్ళీ ఒకేరోజు తమ సినిమాల్ని పోటీకి దించుతారట ఈ హీరోలు.

మొత్తానికి బాలయ్య, రవితేజ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. కాగా బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సారి రవితేజ – బాలయ్య ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :