జూన్ 21.. కాంపిటిషన్ పెరిగిపోతోంది !

Published on Jun 12, 2019 4:00 am IST

చిన్న, మధ్యస్థాయి సినిమాలన్నీ జూన్ నెలనే టార్గెట్ చేశాయి. స్టార్ హీరోల సినిమాలేవీ లేకపోవడంతో థియేటర్లు బాగా అందుబాటులో ఉన్నాయి. దీంతో నిర్మాతలందరూ ఇదే సమయం అనుకుని రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు. రాబోయే మూడు శుక్రవారాలు కొత్త సినిమాలతో థియేటర్లు సందడి చేయనున్నాయి.

మరీ ముఖ్యంగా జూన్ 21వ తేదీకి డిమాండ్ బాగా పెరిగింది. ఇప్పటికే మల్లేశం, ఫస్ట్ ర్యాంక్ రాజు, కెప్టెన్ రాణా ప్రతాప్, ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ ఇలా నాలుగు సినిమాలు 21న రానుండగా ఇప్పుడు మంచు విష్ణు ‘ఓటర్’ సైతం అదే రోజున రిలీజ్ కానుంది. కొద్దిసేపటి క్రితమే ఓటర్ టీమ్ ఈ విషయాన్ని రివీల్ చేసింది.

కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తమిళంలో కృనాల్ 388 పేరుతో రిలీజ్ చేయనున్నారు. పాలిటిక్స్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో విష్ణుకి జోడీగా సురభి నటించింది.

సంబంధిత సమాచారం :

More