కన్ఫర్మ్..”ఆచార్య” నుంచి ‘సిద్ధ’ వస్తున్నాడు.!

Published on Mar 26, 2021 1:45 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు రేపు కానుందండంతో ఆల్రెడీ ఆన్లైన్ లో హంగామా మొదలయ్యిపోయింది. మరి అలాగే ఆఫ్ లైన్ లో కూడా అభిమానులు రచ్చ షురూ చేసారు. మరి ఇదిలా ఉండగా చరణ్ చేస్తున్న ప్రాజెక్టులలో బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ నుంచి పోస్టర్ కన్ఫర్మ్ కాగా మరో భారీ చిత్రాల నుంచి అప్డేట్స్ ఉంటాయా ఉండవా అన్నది ప్రశ్నగా మిగిలింది.

అయితే ఇప్పుడు వాటిలో మెగా మల్టీ స్టారర్ “ఆచార్య” పై అధికారిక క్లారిటీ వచ్చేసింది. తాజాగా చరణ్ తన అభిమానులతో జరిపిన ఇంట్రాక్షన్ లో ఖచ్చితంగా రేపు కొరటాలతో తీసుకున్న “ఆచార్య” నుంచి కూడా పోస్టర్ వస్తుంది అని అది కూడా పెద్ద సర్ప్రైజింగ్ గా ఉంటుందని చరణ్ తెలిపాడు.

దీనితో ఈ అప్డేట్ పై క్లిప్ మెగా ఫ్యాన్స్ లో వైరల్ అవుతుంది. ఇప్పటికే కొరటాల తన ‘సిద్ధ’ను ఓ రేంజ్ లో చూపించనున్నారని తెలిసిందే. మరి ఫుల్ ఫస్ట్ లుక్ లో చరణ్ ఎలా ఉంటాడో తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే. మరి మెగాస్టార్ చిరు హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :