
మెగా పవర్ స్టార్రర్మ్ చరణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధృవ’ దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. తమిళంలో హిట్టైన ‘తనీ ఒరువన్’ కు రీమేక్ గా వస్తునం ఈ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. వరుసగా రెండు ఫ్లాపుల తరువాత చరణ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకి తగ్గట్టే నిర్మాత అల్లు అరవింద్ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో చరణ్ కలెక్షన్ల పరంగా గత సినిమాల రికార్డుల్ని బద్దలు కొడతాడని భావిస్తున్నారు. అలా జాగాలంటే ఈ సినిమా ఓపెనింగ్స్ భారీ స్థాయిలో ఉండాలి.
కానీ ఈ మధ్య అమలులోకి వచ్చిన కరెన్సీ బ్యాన్ విధానం వలన జనాల వద్ద పెద్దగా కరెన్సీ అందుబాటులో లేదు. నిత్యావసరాలకే నానా ఇబ్బందులు పడుతున్న జనం ఇక సినిమాలకి డబ్బు ఖర్చు పెట్టడం కాస్త కష్టమే. అలాగే ఈ మధ్య విడుదలైన కొన్ని సినిమాలు కరెన్సీ బ్యాన్ కష్టాలను పడ్డాయి. ఈ పరిస్థితులన్నింటినీ గమనిస్తున్న అల్లు అరవింద్ ఈ కరెన్సీ కొరత కాస్త తగ్గి ప్రజలు కుదుటపడేవరకూ ఆగితే బాగుంటుందని భావిస్తున్నట్టు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ డిసెంబర్ 2న విడుదలవాల్సిన ఈ సినిమాని గనుక వాయిదా వేయాలనుకుంటే అది డిసెంబర్ 9 లేదా 16 కి వాయిదాపడొచ్చని కూడా అంటున్నారు. మరి అరవింద్, చరణ్ లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

