విజయ్ సినిమా మీదున్న కన్ఫ్యూజన్ తీరిపోయింది

విజయ్ సినిమా మీదున్న కన్ఫ్యూజన్ తీరిపోయింది

Published on Dec 10, 2020 9:00 PM IST

Vijay2

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘మాస్టర్’ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ మొత్తం ముగియడంతో విడుదల సన్నాహాలు జరుగుతున్నాయి. థియేటర్లు రీఓపెన్ అవగానే విడుదల తేదీని ప్రకటిస్తారు. ఇదిలా ఉండగా విజయ్ తర్వాతి సినిమాను ఎవరు చేస్తారనే విషయమై చాలా రోజుల నుండి సస్పెన్స్ నెలకొన్న సంగతి తెలిసిందే. మొదట మురుగదాస్ అనుకున్నారు. కానీ కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆయన ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ పేరు వినిపించినా ఖహ్చితమైన కన్ఫర్మేషన్ రాలేదు. మళ్ళీ మధ్యలో అట్లీ పేరు కూడ తెరమీదకొచ్చింది.

తాజాగా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ విజయ్ 65వ సినిమాను తామే నిర్మిస్తున్నామని, ఈ చిత్రానికి దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ అని ప్రకటన చేయడం జరిగింది. దీంతో ఇన్నిరోజులు ఉత్కంఠకు తెరపడింది. నెల్సన్ దిలీప్ కుమార్ ‘కొలమావు కోకిల’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన చెప్పిన కథ నచ్చడంతో విజయ్ ఆయనకు అవకాశ ఇవ్వడం జరిగింది. ఈ భారీ బడ్జెట్ సినిమాకు అనిరుద్ సంగీతం అందివ్వనుండగా మనోజ్ పరమహంస డీవోపీ చేయనున్నారు. ‘మాస్టర్’ విడుదలయ్యాక ఈ సినిమా పనులు మొదలుకానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు