‘వెంకీ మామ’ వెనక్కి తగ్గుతాడా ?

Published on Oct 16, 2019 12:43 pm IST

ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న హాట్ టాపిక్ సంక్రాంతి సినిమాల రేస్. ఒకే రోజు 12వ తేదీన ‘సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో’ విడుదలకానుండటంతో గందరగోళం మొదలైంది. అసలు ఈ రెండు సినిమాలు ఓకే రోజున రావడానికి కారణం ‘వెంకీ మామ’ అనే టాక్ కూడా ఉంది.

ముందుగా చిత్రాన్ని డిసెంబర్ నెలలో రిలీజ్ చేయాలని అనుకుని తర్వాత సంక్రాంతికి రావాలని డిసైడ్ అయ్యారట. ఈ సంగతి తెలిసే ‘అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు హడావుడిగా 12న వస్తున్నట్టు ప్రకటించాయట. దీంతో ‘వెంకీ మామ’ను 11 లేదా 14న తీసుకువచ్చే
అవకాశం ఉన్నట్టు వార్తలొచ్చాయి. కానీ నిర్మాత సురేష్ బాబు నుండి మాత్రం విడుదల గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు.

ఇప్పుడేమో కొత్తగా చిత్రాన్ని ముందుగా అనుకున్నట్టు డిసెంబర్ నెలలో విడుదల చేయాలనే పునరాలోచనలో సురేష్ బాబు ఉన్నట్టు గుస గుసలు వినబడుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజముంది, ‘వెంకీ మామ’ వెనక్కి తగ్గుతాడా లేదా అనేది ఇంకొన్ని రోజులు ఆగితేనే తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :

More