కంటెంట్ బేస్డ్ క్రైమ్ ఎంటర్ టైనర్ గా “K3”

Published on Aug 12, 2021 10:00 am IST


ఈ ప్రపంచంలో జరిగే ప్రతి క్రైమ్ కి కీర్తి, కాంత, కనకం లో ఏదో ఒకటి కారణంగా నిలుస్తుందనే వాస్తవాన్ని కథాంశం గా తీసుకుని సీనియర్ దర్శకుడు సముద్ర శిష్యుడు ఆదిత్య వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ట్రైడెంట్ మూవీ క్రియేషన్స్ పతాకంపై రొక్కం భాస్కర్ రెడ్డి నిర్మిస్తున్న కంటెంట్ బేస్డ్ క్రైమ్ ఎంటర్టైనర్ కె.3. మగువ ఫేమ్ సురేష్ బాబు, వశిష్ట చౌదరి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రంలో మాణిక్, శ్రీనివాస్ రెడ్డి, జొన్నలగడ్డ, సంధ్య, ప్రవీణ్ బాహు, రాజీవ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ తోపాటు, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ సన్నాహాల్లో ఉంది.

నిర్మాత రొక్కం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, కాన్సెప్ట్ బేస్డ్ మూవీ K3 అని, కథే హీరో అండ్ విలన్ అని అన్నారు. ఆదిత్య వంశీ ప్రతి సీన్ ఎంతో అద్భుతంగా, ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కించాడు అని అన్నారు. సెన్సార్ కోసం సన్నాహాలు చేస్తున్నామని, ఆదిత్య వంశీ దర్శకత్వం, చిన్నికృష్ణ సంగీతం, రవి మాదగోని పాటలు, ఆరిఫ్ లలాని ఛాయాగ్రహణం, ఆర్టిస్ట్స్ పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి ఆయువుపట్టుగా నిలుస్తాయని అన్నారు. కంటెంట్ ఉండే సినిమాలకు మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు, కాబట్టి ఈ చిత్రాన్ని కచ్చితం ఆదరిస్తారనే కాన్ఫిడెన్స్ మాకు ఉంది అని అన్నారు.

సంబంధిత సమాచారం :