అక్కడి ‘దృశ్యం 3’ పై అప్డేట్ ఇచ్చిన కాంట్రవర్సియల్ నటుడు!

అక్కడి ‘దృశ్యం 3’ పై అప్డేట్ ఇచ్చిన కాంట్రవర్సియల్ నటుడు!

Published on May 23, 2026 8:10 AM IST

లేటెస్ట్ గా మలయాళం సినిమా నుంచి వచ్చిన చిత్రమే ‘దృశ్యం 3’. కంప్లీట్ నటుడు మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా భారీ ఓపెనింగ్స్ ని మోలీవుడ్ లో రాబట్టి దుమ్ము లేపింది. అయితే ఇండియాలో దృశ్యం ఫ్రాంచైజ్ మెయిన్ గా మలయాళం, హిందీ, తెలుగు భాషల్లో బాగా పాపులర్ అని తెలిసిందే.

కానీ ఒరిజినల్ మలయాళం తర్వాతే మిగతా రావాలని మేకర్స్ ససేమిరా చెప్పడంతో హిందీలో ఎప్పుడో రావాల్సిన దృశ్యం 3 ఆగిపోయింది. ఇక నెమ్మదిగానే పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో కాంట్రవర్సియల్ నటుడు ప్రకాష్ రాజ్ ఉన్న సంగతి తెలిసిందే. తాను లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. లేటెస్ట్ గా ఫెంటాస్టిక్ షూట్ ని వండర్ ఫుల్ టీం తో పూర్తి చేసినట్టు తాను తెలిపారు. దీనితో హిందీ దృశ్యం 3 దాదాపు పూర్తి కావచ్చింది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు